Mobile Popup Ad
Mobile Popup Ad

నరసాపురంలో దారుణం: మహిళను కత్తితో పొడిచి హత్య!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం (Narasapuram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సఖినేటిపల్లికి చెందిన టీనా రోజా (31) అనే మహిళను, అదే ప్రాంతానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

బాధితురాలు నరసాపురం రైల్వే స్టేషన్ నుండి కారులో సఖినేటిపల్లికి బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగింది. మార్గమధ్యంలో నిందితుడు ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ సురేశ్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>