కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. శక్తి స్వరూపిణి కోల్‌కతా కాళీ మాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందమయ జీవితం ప్రసాదించాలని కాళీమాతను వేడుకున్నట్లు వెల్లడించారు. బెంగాల్ పర్యటనలో భాగంగా లోకేశ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిశారు.
బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణంపై కీలక ప్రతిపాదనలు చేశారు. బెంగాల్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కావాల్సిన స్థలం కేటాయించాలని, ప్రతిగా తిరుమలలో రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మించుకోవడానికి ఏపీ సర్కార్ తరఫున అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సంబంధాలతో పాటు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎంతో లోకేశ్ చర్చించారు.

