అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్లగొండ యువకుడు మృతి!

‎కలం, నల్లగొండ: ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లా యువకుడు (Nalgonda youth) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో జిల్లాలోని మునుగోడుకు చెందిన ఈరమళ్ల సాయితేజ (25) ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సాయితేజ ప్రయాణిస్తున్న కారు రహదారిపై అకస్మాత్తుగా అడ్డువచ్చిన ఒక జింకను ఢీకొట్టి నిలిచిపోయింది.

అయితే, ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక సరకు రవాణా వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు నుజ్జునుజ్జు కావడంతో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక సహాయక సిబ్బంది బాధితుడిని హెలికాప్టర్ (ఎయిర్ అంబులెన్స్) ద్వారా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సాయితేజ మరణవార్త తెలియడంతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి. వారం క్రితమే ఉద్యోగం వచ్చిందని సంతోషంగా చెప్పిన కొడుకు, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>