కలం, వలిగొండ : నల్గగొండ జిల్లాలోని వలిగొండ (Valigonda) మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వర్షం దంచి కొట్టింది. గంట పాటు కురిసిన వర్షం 18.6 మిల్లీమీటర్లుగా నమోదయింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కొన్ని ధాన్యం కుప్పలు కొట్టుకుపోగా మరికొన్ని కుప్పలు తడిసిపోయాయి. మరిన్ని వర్షాలు కురిసే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతూ ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని,తడిసిన ధాన్యానికి మద్దతు ధర అందించాలని కోరుతున్నారు.

