నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత

కలం, నల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ (Market Committee) నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం అధికారికంగా నియమించింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ నూతన కమిటీ చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత వెంకటరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులను ప్రభుత్వం ఖరారు చేసిందని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఐదో పాలకవర్గం చైర్‌పర్సన్ పదవిని ఓసీ (మహిళలు) కేటగిరీకి కేటాయించినట్లు తెలిపారు.

నూతన పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో రైతులకు మార్కెట్‌లో మెరుగైన సేవలు అందుతాయని నల్లగొండ ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం జాబితా

1. బైరెడ్డి హేమలత – చైర్‌పర్సన్
2. వడ్డేపల్లి శ్రీరాములు – వైస్ చైర్మన్
3. తిరుమల రాము – సభ్యుడు
4. కత్తుల కృష్ణయ్య – సభ్యుడు
5. పిన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి – సభ్యుడు
6. మర్రి నరసింహ – సభ్యుడు
7. వడ్డె దామోదర్ రెడ్డి – సభ్యుడు
8. షేక్ సయ్యద్ – సభ్యుడు
9. గౌని నరేష్ – సభ్యుడు
10. నల్గొండ రాణి – సభ్యురాలు
11. పల్లెబోయిన లింగయ్య – సభ్యుడు
12. దేవిరెడ్డి లక్ష్మారెడ్డి – సభ్యుడు
13. చిట్టిపోలు నాగయ్య – సభ్యుడు
14. గుండె రమేష్ బాబు – సభ్యుడు
15. పీఏసీఎస్ చైర్మన్ (తిప్పర్తి) – సభ్యుడు
16. జిల్లా మార్కెటింగ్ అధికారి – సభ్యుడు
17. సహాయ వ్యవసాయ సంచాలకులు – సభ్యుడు
18. నగర మేయర్ (నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్) – సభ్యురాలు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>