కంకోల్ వద్ద బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని ముంబై జాతీయ రహదారిపై భారీ ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ (MSRTC) బస్సులో ఒక్కసారిగా మంటలు (MSRTC Bus Fire) చెలరేగాయి.

కంకోల్ శివారుకు చేరుకోగానే బస్సు ఇంజిన్ నుంచి తీవ్రస్థాయిలో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపివేశారు. ప్రమాదాన్ని పసిగట్టి ప్రయాణికులను తక్షణమే కిందకు దింపేయడంతో లోపల ఉన్న 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>