సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కీలక సూచన

కలం, వెబ్ డెస్క్: సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఈ రోజు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ అందుబాటులోకి వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ మీద కక్షతోనే ఇన్నాళ్లు ఆసుపత్రి ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అల్వాల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. అలాగే, రెండు వేల పడకలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ఆలోచన అదే..

జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి పొందిన ఎయిమ్స్ తరహాలోనే తెలంగాణలో కూడా అత్యాధునిక వసతులతో ప్రభుత్వాసుపత్రులు ఉండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ వివరించారు. ఈ రోజు ప్రారంభం కాబోతున్న సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి 22 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వెయ్యి పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 ఆపరేషన్ థియేటర్లు, అవయవ మార్పిడి విభాగం, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్ రే, క్యాథలాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి అన్నిరకాల విభాగాలతో ఏర్పాటై.. ఒకే చోట ఉండటం రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు స్థానికంగానే వైద్యం అందించే వెసులుబాటు లభించిందన్నారు. బస్తీ దవాఖానాల్లో నాలుగు వేల పడకలు, 1200 ఎమర్జెన్సీ బెడ్లు కూడా ఏర్పాటు చేయడంతో పేద రోగులకు వైద్యానికి ఎంతో భరోసాగా నిలుస్తున్నాయని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>