కలం, జనగామ: గురు పౌర్ణమి వేళ బుధవారం జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో కురిసిన మోస్తరు వర్షం వేళ కురుమవాడలో హృదయాలను హత్తుకునే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ కోతి చిన్న పిల్లిని తన ఒడిలో చేర్చుకుని (Monkey Hugs Kitten) ఆప్యాయంగా కూర్చున్న దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్ఫోన్లలో బంధించగా, చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. “ప్రేమకు జాతి లేదు.. మమకారానికి హద్దులు లేవు” అనే మాటలను ఈ దృశ్యం సాక్షాత్కరించిందంటూ పలువురు వ్యాఖ్యానించారు.
మూగజీవాల్లోనూ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎంత గొప్పగా ఉంటాయో తెలియజేసిన ఈ అరుదైన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. చూసిన ప్రతి ఒక్కరూ “మనుషులకు సైతం మానవత్వం నేర్పించే దృశ్యం ఇదే” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

