రాజ‌కీయాల‌కు అతీతంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే సంజయ్

కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేయూతనిస్తూ పెన్షన్లు అందిస్తోందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో పెన్షన్ల రూపంలో సుమారు రూ.47 కోట్ల మేర నిధులు అందుతున్నాయని, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.40 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనేక నిబంధనలు విధించారని విమర్శించారు.

యూరియా, డీఏపీ, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతుల పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, అయితే పెట్టుబడి సాయం విషయంలో మాత్రం అనేక నిబంధనలు విధిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదని, కక్ష సాధింపు తన విధానం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. వంజరుపల్లి గ్రామ రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, సర్పంచ్ అదరవేని గంగమల్లయ్య, ఉపసర్పంచ్ బొల్లె తిరుపతి భీమవ్వ, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఎంపీడీవో రమాదేవి, ఎంఆర్‌ఓ హకీం, మాజీ పాక్స్ చైర్మన్ సదాశివరావు, మండల సర్పంచుల ఫోరం కట్ట రాజేందర్, మాజీ ఎంపీపీ మహేష్, సర్పంచులు ప్రకాశ్, వంశీ, కుడుకుల లక్ష్మణ్, అంకం సతీష్, నరేష్, గంగారం, డీసీసీ ఉపాధ్యక్షులు డీలర్ రవి, నాయకులు తిరుపతి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ శంకర్‌ అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>