మహిళా సమైక్య సంఘ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

కలం, నిర్మల్ : మహిళా సంఘాలను బలోపేతం చేసి, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. భైంసా మండలం మంజ్రి గ్రామంలో వీఓ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (Pawar Ramarao) మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి, ఆర్థిక కార్యకలాపాల్లో మరింత ముందుకు సాగేందుకు వీఓ మహిళా సమైక్య సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు వివిధ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత సమయంలోగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>