కలం, మునుగోడు: నాయకుడనే వాడు ప్రజలకు దగ్గరగా ఉండి వారి బాధలు విని, వారిని గౌరవించినప్పుడే ప్రజల్లో మనగలుగుతాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తెలిపారు. చౌటుప్పల్ క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎంపికైన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై అభినందించారు. గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిల్లో ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సరైన ఫలితాలు వస్తాయన్నారు. 2018 ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ (BRS) పార్టీ గెలిస్తే మునుగోడులో మాత్రం కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు.
రాజకీయాల్లో ఉండేవారు ఓపికతో పనులు చేసుకుంటూ పోతే పదవులు వస్తాయన్నారు. నాయకుడనేవాడు వ్యక్తిగతంగా మంచివాడా.. కాదా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా అని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గెలిచిన తర్వాత ప్రవర్తనలో మార్పు వస్తే వచ్చేసారి ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) గుర్తుచేశారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజగోపాల్ రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల, మున్సిపల్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Also: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
Follow Us On: Instagram

