Mobile Popup Ad
Mobile Popup Ad

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

కలం, వెబ్ డెస్క్ : కదిరి (Kadiri) ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ (Kandikunta Venkata Prasad) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే, రోగులను కలసి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే (Kandikunta Venkata Prasad)  రాకతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. సేవలపై మరింత శ్రద్ధ చూపించారు. రోగులకు అందిస్తున్న భోజనాన్ని కూడా ఎమ్మెల్యే స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. అలాగే ఆసుపత్రి సేవల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>