రేషన్ డీలర్ల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు (Ration Dealers) గౌరవ వేతనం, క్వింటాలుకు 300 రూపాయల కమిషన్, ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జిల ఏర్పాటు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, తదితర అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ నాగిరెడ్డిని, పటాన్ చెరువు శాసనసభ్యులు, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు కలిశారు

క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించరని… ప్రభుత్వంతో చర్చించి డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, రాష్ట్ర ప్రతినిధులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>