కలం, నేరడిగొండ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో బోథ్ నియోజకవర్గానికి చెందిన 97 మంది లబ్ధిదారులకు రూ.20.44 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్సకు ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనం కలిగిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

