నిరుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్​ ఫండ్ భరోసా: ఎమ్మెల్యే ఏలేటి

కలం, లక్ష్మణచందా: లక్ష్మణచందా మండల కేంద్రంలోకి చెందిన కూనింటి ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1.10 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>