Mobile Popup Ad
Mobile Popup Ad

ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aలోకి మార్చాలి: వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ముదిరాజ్ లను BC-D నుంచి BC-Aలోకి లోకి మార్చాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను మంత్రి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో బీసీల జనాభా 56.36 శాతం ఉందని, అందులో ముదిరాజ్ సామాజిక వర్గ జనాభా 7.4 శాతం ఉందని తెలిపారు.

ముదిరాజ్ జాతి ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే BC-D నుండి A లోకి మారిస్తే భావి తరాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఒక మంత్రిగా కాకుండా ఒక ముదిరాజ్ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కాసాని వీరేష్, బలరామ్ తదితరులు బీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>