Mobile Popup Ad
Mobile Popup Ad

బురద రోడ్డు సమస్యకు పరిష్కారం.. మంత్రి సవిత హామీ

కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యపై మంత్రి సవిత(Minister Savitha) స్పందించారు. పోలేపల్లి గ్రామం నుంచి రాచూపల్లి పాఠశాలకు వెళ్లే బురద రోడ్డు కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారు మంత్రికి వినతిపత్రం ద్వారా తెలియజేశారు. విద్యార్థుల సమస్యను గమనించిన మంత్రి సవిత తక్షణమే స్పందిస్తూ, రూ.1.72 లక్షల నిధులతో రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులు పాఠశాలకు సులభంగా వెళ్లగలరని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’, ‘విద్యా కిట్లు’ వంటి పథకాలపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకాలు తమ చదువుకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామంతో గ్రామంలో సంతోష వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>