సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చుక్కెదురు..!

కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ( Chevireddy) చుక్కెదురైంది. ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ను కొట్టివేయాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు సోమవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ ను అప్రూవర్‌గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తన పిటిషన్‌లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్‌లో విచారించాల్సిన అంశాలేవి లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చింది. దీంతో ఈ పిటిషన్‌ విచారణను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు.. ఈ కేసుపై అనుమానాలుంటే సరైన సమయంలో అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>