epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ఎన్​టీఆర్​ ఘాట్​ వద్ద మంత్రి నారా లోకేశ్​ నివాళి

కలం, వెబ్​డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఏపీ మంత్రి నారా లోకేశ్​ (Nara Lokesh) నివాళి అర్పించారు. హైదరాబాద్​లోని ఎన్​టీఆర్​ ఘాట్​ వద్దకు ఆదివారం ఉదయాన్నే చేరుకొని, తాత సమాధిపై బొకేలు ఉంచి అంజలి ఘటించారు. ఆయనతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అలాగే సినీ నటుడు నందమూరి కళ్యాణ్​ రామ్​ సైతం ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద తాత సమాధికి నివాళి అర్పించారు. తెలంగాణ సచివాలయానికి సమీపంలోని ఈ ఘాట్​ను ఎన్​టీఆర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో అలంకరించారు. అలాగే ఎన్టీఆర్​మూవీ, పొలిటికల్​ జర్నీకి సంబంధించిన ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. పోలీసులు ట్రాఫిక్​కు ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు.

Nara Lokesh

Read Also: హోమ్ లోన్ కట్టేశారా.. ఇలా చేస్తే బ్యాంకులే మీకు డబ్బు చెల్లిస్తాయి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>