Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లండి.. రైతులకు బండి సంజయ్ పిలుపు

కలం, కరీంనగర్ బ్యూరో: రసాయన ఎరువుల ద్వారా పండిస్తున్న పంటలను కొని తినడమంటే.. పైసలిచ్చి రోగాలను కొని తెచ్చుకోవడమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar ) ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రైతులంతా రసాయన ఎరువుల వాడకాన్ని విడనాడి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. సేంద్రీయ వ్యవసాయం చేసిన రైతులు కోటీశ్వరులు అయ్యే అవకాశముందన్నారు. కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యేయమన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో “ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం” కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తోపాటు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మీ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రు నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షలు గంగాడి కృష్ణారెడ్డి, కేవీకే వ్యవస్థాపక సభ్యులు విజయపాల్ రెడ్డి, సీనియర్ సైంటిస్టు వెంకటేశ్వర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు మహిపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను, ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. భూమి పూజ చేశారు. మొక్క నాటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందకు కృషి విజ్ఞాన కేంద్రం చేస్తున్న కృషిపై ఆరా తీశారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగించారు. గోమాత, భూమాత, భరతమాత.. నినాదంతో మూడేళ్లపాటు 6 వేల 18 మంది రైతులతో 19 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రాబోయే రోజుల్లో 50 వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్న జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులను, సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో “రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించి, ప్రకృతి/సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దేశాన్ని “Natural Farming Hub”గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేశారు. 2015లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY), PM-PRANAM, National Mission on Natural Farming వంటి పథకాలను ప్రవేశపెట్టారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషస్ (National Mission on Natural Farming) కు గతేడాది బడ్జెట్ లో ఏకంగా రూ.2 వేల 481 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు.

అందుకే తెలంగాణలోని రైతాంగాన్ని నేను కోరేదొక్కటే. ఇకనైనా రసాయన ఎరువులను విడనాడండి. ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లండి. మద్దతు ధర రాదనే విషయాన్ని పక్కనపెట్టండి. కోటీశ్వరులు అయ్యే అవకాశముంది. సేంద్రీయ వ్యవసాయ పంటలను కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టి 4,400 రోజులైంది. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై విస్త్రత అవగాహన కల్పించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలంతా ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు కొనడానికి సిద్దంగా ఉన్నారు. రైతులంతా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేంద్రీయ పంటలు సాగు చేయాలని కోరుతున్నా. అట్లాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై సోలార్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>