మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కలం, కరీంనగర్ బ్యూరో: మహిళలు అన్ని రంగాల్లో ఎదగడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) అన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ మొదటిసారిగా కరీంనగర్ (Karimnagar)జిల్లాకు విచ్చేసిన సందర్భంగా డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డా.మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజర‌య్యారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని గొప్ప ఆలోచన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆలోచనతో పెట్రోల్ బంక్ యజమానులను, ఆర్టీసీ బస్సు యజమానులను చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు యజమానురాలిగా వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ చేసి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన ఘ‌న‌త‌ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన మహిళల‌ పేరుతో ఉండాలని ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. పార్టీ కోసం శ్రమించిన మహిళలకు చట్టసభల్లో అవకాశం తప్పక వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధిక మంది మహిళలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ముగ్గురు మంత్రులం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట – ఎర్రబెల్లి స్వర్ణ

నిరంకుశ పాలన నుండి విముక్తి కలిగి రెండున్నర సంవత్సరాలు అవుతుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ముందుకు తెస్తున్నారన్నారు. ఒక మంచి మనసుతో కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు పేద ప్రజలందరికీ సన్నబియ్యం అందించాలని సీఎం చేసిన ఆలోచన నేడు ఎంతో మంది కడుపు నింపుతుందన్నారు. మత రాజకీయాల పేరుతో మనుషులను విడగొట్టి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీకి వ్య‌తిరేకంగా ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని అప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్రలో మనమంతా పాల్గొన్నామన్నారు. నాడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సంస్కరణల ద్వారా మహిళలకు పంచాయతీలలో అవకాశం కల్పించారని, మహిళలు కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్తు, భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టడం, సామాజిక సేవ, రాజకీయంతో ఏ విషయంలోను తీసిపోరని నిరూపిస్తున్నారన్నారు.

బీజేపీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ తో ముడి పెట్టారని, మహిళలు పురుషులతో సమానంగా రాబోయే రోజుల్లో కచ్చితంగా రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. వెన్ను తట్టి ప్రోత్సహించిన నాయకులను తాము తల మీద పెట్టుకొని చూసుకుంటామన్నారు. ప్రతి మహిళ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ మహాలక్ష్మి, సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, చర్ల పద్మ, కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి, నాయకురాలు పూదరి రేణుక గౌడ్, పడిశెట్టి వసంత లక్ష్మి, చంద్రకళ సిరిపురం లావణ్య, హసీనా, రాచర్ల పద్మ, కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు . ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>