మెడికల్‌ కోడింగ్‌పై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం

కలం, వనపర్తి: విద్యార్థినులు మెడికల్‌ కోడింగ్‌ రంగంపై అవగాహన పెంచుకోవాలని, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెడికల్‌ కోడింగ్‌ సీఈఓ మౌనిక సూచించారు. వనపర్తి ( Wanaparthy)ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు మెడికల్‌ కోడింగ్‌పై (Medical Coding)శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌ కోడింగ్‌ సీఈఓ మాట్లాడుతూ.. మెడికల్‌ కోడింగ్‌ రంగం ప్రాధాన్యత, విధులు, భవిష్యత్‌లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను విద్యార్థినులకు వివరించారు.

కార్యక్రమంలో విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్వాహకులు సమాధానాలు అందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డా.బి.ఈశ్వరయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఈ. రామరాజు యాదవ్‌, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ కె. దామోదర్‌రెడ్డి. టీఎస్ కేసి కోఆర్డినేటర్‌ ఎస్. స్వామి, సభ్యులు జి. సుష్మ, జి. యువరూప లక్ష్మి, కె. శ్రీనివాసులు, ఎఫ్ టి యం కె. నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>