కొత్త పింఛ‌న్లపై మెదక్ కలెక్టర్ ప్రకటన

క‌లం, మెద‌క్ బ్యూరో: కొత్త చేయూత పింఛన్లు (Cheyutha Pension) దరఖాస్తులు మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో స్వీకరించబడుతున్నాయని మెద‌క్ క‌లెక్టర్ ప్రతీమా సింగ్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో ఏమైనా సమస్యలుంటే, వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇంకా యూడీఐడీ ధ్రువీకరణ పత్రం లేని దివ్యాంగులు ఎవ‌రైనా ఉంటే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇందుకోసం ప్రభుత్వాస్పత్రిలో GGHలో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా మిగిలినవారు మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31 తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>