మెట్‌పల్లిలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం

కలం, కరీంనగర్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి (Metpally)లో ఒక్కసారిగా రాజకీయం అగ్గిరాజుకుంది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో శ్రేణులు కదం తొక్కాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. తమ లీడర్ పై దాడి చేసేందుకు వస్తున్నారని ఆరోపిస్తూ మరోవైపు ఎమ్మెల్యే ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. నాన్‌లోకల్ కార్యకర్తలు వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. గేట్ దాటి బయటకు వెళ్లేది లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తల స్పష్టం చేశారు. ఇతర పార్టీ నాయకులు లోపలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. మెట్‌పల్లిలో ఏం జరగబోతోందన్న దానిపై పట్టణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>