కలం, స్పోర్ట్స్: గుకేశ్ వర్సెస్ సిందరోవ్ (Gukesh vs Sindarov) ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్‌పై మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌ను గుకేశ్ తన టైటిల్‌ను కాపాడుకునే పోరుగా చూడకూడదని చెప్పాడు. తన దృష్టిలో గుకేశ్‌కు కోల్పోయేదేమీ లేదని, సాధించడానికి చాలా ఉందని పేర్కొన్నాడు. గత రెండేళ్లలో గుకేశ్ అద్భుతంగా ఆడిన విషయాన్ని కార్ల్సన్ గుర్తుచేశాడు. 2024లో గుకేశ్ అత్యున్నత స్థాయిలో ఆడగల సామర్థ్యాన్ని చూపించాడని చెప్పాడు. ప్రస్తుతం చాలామంది గుకేశ్ అదే స్థాయిని మళ్లీ చూపిస్తాడని నమ్మకపోవచ్చని కార్ల్సన్ అన్నాడు.
అయితే అదే గుకేశ్‌కు మరింత ఆసక్తికరమైన సవాలని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో మానసిక పోరు కూడా చాలా కీలకమని కార్ల్సన్ అభిప్రాయపడ్డాడు. చిన్న సందేహం సిందరోవ్‌పై ప్రభావం చూపొచ్చని, అదే సమయంలో గుకేశ్‌కు ఆత్మవిశ్వాసం పెరగొచ్చని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ప్రస్తుత ఫామ్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే అంశంపై కూడా కార్ల్సన్ స్పందించాడు. ప్రపంచ ఛాంపియన్‌ను నిర్ణయించే ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్‌పై తనకు అంతగా నమ్మకం లేదని చెప్పాడు.
ఇక గుకేశ్, సిందరోవ్ నాణ్యత పరంగా సమాన స్థాయిలో ఉన్నారని కార్ల్సన్ పేర్కొన్నాడు. గుకేశ్ తన అత్యున్నత స్థాయిలో సిందరోవ్‌తో సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా ఆడగలడని చెప్పాడు. అయితే మ్యాచ్‌లో తొలి ఆధిక్యం ఎవరికి దక్కుతుందనేదే కీలకమని కార్ల్సన్ అభిప్రాయపడ్డాడు. సిందరోవ్ ముందంజలోకి వస్తే గుకేశ్‌కు పరిస్థితి కష్టమవుతుందని, గుకేశ్ ముందంజలోకి వస్తే అతడే బలమైన ఫేవరెట్‌గా మారతాడని వివరించాడు.

