ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ‘ఢిల్లీ మార్చ్​’ : సీపీఎం

కలం, వెబ్​డెస్క్​: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ‘ఢిల్లీ మార్చ్’ చేయనున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి (MA Baby) తెలిపారు. ఎన్​డీఏ ప్రభుత్వం తెచ్చిన కొత్త లేబర్​ కోడ్స్​, ఉపాధి హామీ పథకంలో మార్పులు, వాణిజ్య ఒప్పందాలను నిరసిస్తూ మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకంటే ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో పలు ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.

‘రాబోయే నెలలో ఢిల్లీ మార్చ్​ నిర్వహించాలని నిర్ణయించాం. దీనికంటే ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో వివిధ కళాజాతలు ఏర్పాటుచేస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, వాటి కారణంగా తలెత్తుతున్న జీవనోపాధి సమస్యలపై ప్రజలను కూడగట్టి, చైతన్యవంతం చేస్తాం. ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

భారత సౌర్వభౌమాధికారాన్ని ఎన్​డీఏ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం బలహీనం చేస్తోందన్న ఆయన(MA Baby).. ఈ సందర్భంగా క్రూడాయిల్​ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని నిలదీశారు. ‘మనం ఎక్కడి నుంచి ఆయిల్​ కొనాలనేది అమెరికా నిర్ణయించడమేంటి? భారత్​ ఎక్కడ నుంచి ఇంధనం కొనాలో భారతే నిర్ణయిస్తుందని ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు అర్థమయ్యేలా ప్రధాని మోదీ చెప్పాల’ని డిమాండ్​ చేశారు.

Read Also: గర్భిణి మెటర్నిటీ ఫొటో షూట్​.. మొదటి బిడ్డ దుర్మరణం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>