లోయర్ మానేరు డ్యామ్‌లో నీటి నిల్వపై తాజా అప్‌డేట్

కలం, కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ (Lower Manair Dam – LMD) వద్ద బుధవారం ఉదయం 6 గంటలకు నమోదు అయిన సమాచారం ప్రకారం జలాశయంలో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ​ప్రస్తుత నీటిమట్టం నివేదిక ప్రకారం..​

గరిష్ట నీటిమట్టం (FRL) 920.00 అడుగులు (280.48 మీటర్లు)
పూర్తి సామర్థ్యం: 24.034 TMCలు,
​నేటి నీటిమట్టం 901.25 అడుగులు (274.77 మీటర్లు), ప్రస్తుత నీటి నిల్వ 10.926 TMCలు,
​నిన్నటి నీటిమట్టం 901.25 అడుగులు (10.926 TMCలు),
​గత ఏడాది ఇదే రోజు 899.95 అడుగులు (10.253 TMCలు)

​వర్షపాతం నిల్..

ప్రస్తుతం జలాశయంలోకి 242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే పరిమాణంలో (242 క్యూసెక్కులు) బయటకు వెళ్తోంది.

​ఇన్‌ఫ్లో (242 క్యూసెక్కులు) నది ద్వారా 242 క్యూసెక్కులు వస్తుండగా.. ఎమ్‌ఎమ్‌ఆర్ (MMR), చెక్ డ్యామ్ (CR@144) ల నుండి ఇన్‌ఫ్లో సున్నాగా నమోదైంది.

అవుట్‌ఫ్లో (242 క్యూసెక్కులు).. మిషన్ భగీరథ ద్వారా 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాల (Evaporation) రూపంలో 99 క్యూసెక్కులు పోవుచున్నాయి. స్పిల్‌వే, కాకతీయ కాలువ (KC) ద్వార నీటి విడుదల నిలిపివేశారు.

​జూన్ 1, 2026 నుండి ఇప్పటివరకు

ఈ సీజన్‌లో ఇప్పటివరకు డ్యామ్‌లోకి 6.214 TMCల ఇన్‌ఫ్లో (నది: 1.598, MMR: 4.616) రాగా.. మిషన్ భగీరథ, ఆవిరి నష్టాల రూపంలో 1.653 TMCల నీరు వెచ్చించబడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>