ఆస్ట్రేలియా టెస్టులకు లిటన్ దాస్ రీఎంట్రీ..!

కలం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టుకు శుభవార్త అందింది. పిక్క గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (Litton Das) తిరిగి జట్టులోకి వచ్చారు. ఆగస్టు 13న మొదలయ్యే తొలి టెస్టు కోసం ఆయన ఆదివారం డార్విన్ వెళ్లనున్నారు. బంగ్లాదేశ్ టీమ్ ఏకంగా 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. టీమ్‌లోని సీనియర్ ప్లేయర్ లిటన్ దాస్ ఇప్పటివరకు 104 వన్డేల్లో 2,869 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఆయన గాయంతో ఆటకు దూరంగా ఉన్నారు.

జూన్ 2025 నుంచి వన్డే కెప్టెన్‌గా ఉన్న మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలో బంగ్లాదేశ్ 20 వన్డేల్లో 10 గెలిచింది. కానీ జింబాబ్వే చేతిలో సిరీస్ ఓడిపోవడంతో మిరాజ్ వైదొలిగారు. దీంతో 2027 ప్రపంచకప్ దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్న లిటన్ దాస్‌కే బిసిబి ఇటీవల వన్డే కెప్టెన్సీని కూడా అప్పగించింది. యువ బౌలర్ నహీద్ రాణా సిరీస్ మొత్తానికి, షరీఫుల్ ఇస్లామ్ తొలి టెస్టుకు గాయాల వల్ల దూరమయ్యారు. ఇలాంటి సమయంలో రీహ్యాబిలిటేషన్ పూర్తి చేసుకున్న లిటన్ దాస్ రీఎంట్రీ ఇవ్వడం జట్టుకు కొండంత బలాన్నిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>