కలం, యాదాద్రి భువనగిరి: గతంలో పేదలకు భూములు పంచిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలో ఉన్నందున అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని భూ రక్షణ సమితి కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య తెలిపారు. ఈ మేరకు సమితి ఆధ్వర్యంలో 24న ఉదయం 11:30 గంటలకు భువనగిరి (Bhuvanagiri) పట్టణంలోని ఎస్.వి హోటల్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చ..
ఈ సందర్భంగా బుగ్గ మైసయ్య మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల యాజమాన్య హక్కుల సాధన, చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులతో పాటు అసైన్డ్ భూముల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తగిన సూచనలు, సలహాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ అడ్వైజర్ డప్పు వీరాస్వామి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మోత్కుపల్లి రవి, తాళ్లపల్లి దేవానందం, నాయకులు శివరాత్రి సురేష్, సుంచు బాలయ్య, కాటా భిక్షపతి పాల్గొన్నారు.

