కలం, నాగర్ కర్నూల్: మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి ఇటీవల మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం గ్రామానికి వచ్చిన కేటీఆర్ లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.

