ఎన్‌ఐటీ వరంగల్ 24వ స్నాతకోత్సవం

కలం, వరంగల్‌: వ్యక్తిత్వం, నిజాయితీ, విశ్వసనీయతతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఇండియా ఎండీ సంతోష్‌కుమార్‌ ఎన్‌ఐటీ వరంగల్‌ (NIT Warangal ) విద్యార్థులకు సూచించారు. శనివారం జరిగిన 24వ స్నాతకోత్సవం తొలిరోజు 930 మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌, 22 మంది ఎగ్జిట్‌ డిగ్రీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా.. ఎన్‌ఐటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్‌పర్సన్‌ డా. బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐ యుగంలో ఇంజనీర్ల బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుది సంస్థలో రూ.900 కోట్ల మౌలిక వసతుల పనులు, పరిశోధనలకు రూ.53.63 కోట్ల నిధులు లభించినట్లు తెలిపారు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌లో అత్యుత్తమ ప్రతిభకు సిద్ధి బార్పుటేకు డైరెక్టర్‌ గోల్డ్‌ మెడల్‌ అందజేశారు. డా. పి.కె. మెనన్‌, మైక్రాన్‌ ఇండియా ఎండీ ఆనంద్‌ రామమూర్తికి గౌరవ డిగ్రీలు ప్రదానం చేశారు. ఆదివారం పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>