epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్‌పై రణభేరి మోగించాలి.. విద్యార్థులకు కేటీఆర్ పిలుపు

తెలంగాణ విద్యారంగం కాంగ్రెస్ హయాంలో నీరుగారిపోతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ అరాచకాలపై ప్రతి విద్యార్థి యోధుడిలా పోరాడాలని అన్నారు కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, ఫీజు రియింబర్స్‌మెంట్, గురుకుల సమస్యలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నుంచి నియోజకవర్గం కేంద్రాల్లో భారీ ఆందోళనలు చేయాలని తెలిపారు. నవంబర్ 29న దీక్ష దివాస్‌ను చరిత్రలో నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించాలన్నారు. తన నివాసంలో విద్యార్థి విభాగం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారని గుర్తు చేశారు. గత పదేళ్లలో ఏమీ జరగలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి తెరతీసింది. వారి అబద్ధాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంది” అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేవలం స్ధానిక సంస్ధలకే కాదని, విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ అమలవుతుందని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఈ అంశంపై యువతను జాగృతం చేయాలన్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలి. ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా విద్యార్థి గొంతుక బలంగా వినిపించాలి,” అని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వచ్చే నెల నుంచి పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు కేటీఆర్(KTR) ప్రకటించారు. గురుకులాల్లో కల్తీ ఆహారం మొదలుకొని, విద్యార్థుల ఆత్మహత్యల వరకు అనేక విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల దుస్థితిపై మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని స్పష్టం చేశారు.

Read Also: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!