కేటీఆర్ కీలక నిర్ణయం: వచ్చే జూలై టార్గెట్​ !

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తన ఫిట్‌నెస్ ప్రయాణంపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పెరుగుతున్న పొట్టను దాచడం ఇక తన వల్ల కాదని, అందుకే మళ్లీ కసరత్తులు ప్రారంభించినట్లు ఆయన సరదాగా పేర్కొన్నారు. సుమారు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వ్యాయామం మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

వచ్చే జూలై నాటికి కేటీఆర్ 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన 50వ పుట్టినరోజు నాటికి పూర్తి ఆరోగ్యంతో, మంచి శారీరక ఆకృతిని సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కేటీఆర్​ (KTR) ఈ సందర్భంగా తెలిపారు. తన ఫిట్‌నెస్ లక్ష్యాలను పంచుకుంటూ ఫొటోతో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: కల్తీ మాల్.. ప్రాణాలకి డేంజర్ బెల్స్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>