కౌట్ల(బి) సహకార సంఘానికి ముగ్గురు కొత్త డైరెక్టర్లు

కలం, సారంగాపూర్ : సారంగాపూర్ మండలం కౌట్ల(బి) (Koutla B) గ్రామంలోని పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం డైరెక్టర్ల ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. మూడు డైరెక్టర్ పదవులకు తొమ్మిది మంది పోటీ పడగా అట్ల శ్రీకాంత్‌రెడ్డి, వంగ రాంరెడ్డి, పాతయిర సత్యపాల్‌రెడ్డి విజయం సాధించారు. సంఘంలో మొత్తం 164 మంది రైతు సభ్యులు ఉండగా 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.2026–27 సంవత్సరానికి సంఘం అధ్యక్షుడిగా ఇప్ప వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సాధు రాంరెడ్డి కొనసాగుతుండగా, నూతనంగా ఎన్నికైన అట్ల శ్రీకాంత్‌రెడ్డి కార్యదర్శిగా, పాతయిర సత్యపాల్‌రెడ్డి కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల అధికారిగా ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్ వ్యవహరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>