ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (Khammam DMHO) డాక్టర్ డి. రామారావు శుక్రవారం నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీమంతా, సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లిన డీఎంహెచ్‌వో వార్డులు, ల్యాబ్స్, ఫార్మసీతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు.

క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 ప్రకారం ఆసుపత్రి అనుమతులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ బిందు శ్రీ, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>