అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందించాలి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్: ఉట్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Bojju Patel) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుల నమోదు తీరును, లబ్ధిదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, నమోదు సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>