డీలిమిటేషన్ బిల్లు.. రాష్ట్రపతి కీలక సిఫార్సు

కలం, వెబ్​ డెస్క్​: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న డీలిమిటేషన్​ బిల్లు (Delimitation Bill)పై కీలక ముందడుగు పడింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026ను పార్లమెంట్​ లో పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 117(3) ప్రకారం రాష్ట్రపతి ఈ సిఫార్సు చేశారని లోక్​ సభ సెక్రటరీ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే లోక్‌సభ స్థానాల గరిష్ట సంఖ్య 850కి పెరగనుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా 2051 వరకు సీట్ల కేటాయింపులు కొనసాగించేలా ఈ బిల్లు కేంద్ర ప్రతిపాదనలు చేసింది.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియకు కూడా ఈ బిల్లు ద్వారా మార్గం సుగమం కానుంది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్​ లో డీలిమిటేషన్​ బిల్లును (Delimitation Bill) ప్రవేశ​ పెట్టేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), బీఆర్ఎస్​ మద్దతు ప్రకటించగా కాంగ్రెస్​ నేతృత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Also Read : డీ లిమిటేషన్‌ ఒప్పుకోం.. బీజేపీ టార్గెట్ అదే: ఖర్గే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>