Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో ఘోర ప్రమాదం: వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలోని గోపాలపురం (Gopalapuram)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వాహనం వ్యక్తిపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతదేహం అత్యంత దారుణంగా ఛిద్రమవడంతో, శరీర భాగాలను సేకరించేందుకు పోలీసులు అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్‌ను పిలిపించారు. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలను సేకరించి, ఫౌండేషన్ అంబులెన్స్‌లో మార్చురీకి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు వైరాకు చెందిన తెలకపల్లి సాంబయ్య (35)గా గుర్తించారు. ఆయన ఖమ్మంలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని, వైరా నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>