బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు సీరియస్ దృష్టి సారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి (MLC Venkatrami Reddy) కుమారుడు భరత్‌రాజ్‌రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. మంగళ్‌హాట్ పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తులో డ్రగ్ పెడ్లర్ల సంప్రదింపు జాబితాలో భరత్‌రాజ్‌రెడ్డి పేరు ఉండటంతో ఆయనను విచారణకు పిలిచారు. ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27(బి) కింద నోటీసు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ల నెట్‌వర్క్‌ పై జరుగుతున్న విచారణలో సేకరించిన డేటాను విశ్లేషించే సమయంలో ఈ పేరు బయటపడింది. ఆ తర్వాతనే ఆయనకు నోటీసులు జారీ చేసి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆయనకు గంజాయి వినియోగానికి సంబంధించిన కేసులో నోటీసు అందజేశారు. విచారణ సందర్భంగా తాను స్వచ్ఛందంగా డ్రగ్ డీ-అడిక్షన్ (పునరావాస) కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>