ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం ఆగ్రహం

కలం, ఖమ్మం బ్యూరో: ​కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వినాశకర విధానాలపై సీపీఎం (CPM) రాజీలేని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు (Pothineni Sudarshan Rao), జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు (Nunna Nageswara Rao) స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం మంచికంటి భవన్‌లో జరిగిన సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశంలో వారు మాట్లాడారు. ​దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను కేంద్రం భ్రష్టుపట్టిస్తోందని మండిపడ్డారు.

ఓటర్ల తొలగింపు కుట్రలపై పోరాటం చేశాం..

ఓటర్ల తొలగింపు కుట్రలను అడ్డుకోవడంలో సీపీఎం ముందుండి పోరాడిందని నాయకులు గుర్తుచేశారు. ఇదే సమయంలో జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణతో పాటు రేషన్ ద్వారా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల సరుకులు అందించాలని కోరారు.

తక్షణమే సిట్ ను రంగంలోకి  దించాలి..

సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య (Samineni Rama Rao) ఉదంతంలో పోలీసులు సరైన దర్యాప్తు జరపకుండా, రాజకీయ హత్యను లౌకిక/ఆర్థిక నేరంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. తక్షణమే సిట్ ను రంగంలోకి దించి, అసలైన దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15న నల్లగొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ మహాసభను జయప్రదం చేయడానికి ఖమ్మం జిల్లా నుండి భారీగా తరలివెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ​కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు జిల్లా నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>