కలం, వెబ్ డెస్క్: జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం (Uppal Bhagayat Protest) చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యమకారుల భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు.
వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని విన్నవించారు.

