Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణి హక్కుల కోసం టీఆర్ఎస్ పోరాడుతోంది: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతోందని  టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాన్నారు. కాసిపేట మైన్ వద్ద గేట్ వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని మండిపడ్డారు.

రేవంత్, భట్టి మభ్యపెడుతున్నారు..

పాలసీలు చేయాల్సిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం దానిని నిలిపివేసిందని చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం.. సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వచ్చామని.. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కలిసి పనిచేశామని గుర్తు చేశారు. సింగరేణిలోని మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించామన్నారు. ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని చెప్పారు.

దాదాపు లక్ష ఉద్యోగాలు ఇవ్వొచ్చు..

సింగరేణికి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇవ్వవచ్చని అన్నారు. కార్మికుల కోసం హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా, పోరాటాల్లోనైనా హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ సంయుక్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. అన్నింటిల్లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందుకే తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందని తెలిపారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా తాము అందజేస్తామని అన్నారు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత సింగరేణిలో తన మొదటి యాత్ర ఇదేనని.. తమ పార్టీకి సింగరేణి కార్మికుల దీవెనార్తి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>