Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు

కలం, వరంగల్ బ్యూరో : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కాటారం (Kataram) సబ్ డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ పర్యవేక్షణలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారణతో పాటు రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కమలాపూర్ క్రాస్ నుండి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసారు. ఈ బోర్డులను ప్రమాద ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందించి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని వారు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>