కరీంనగర్‌లో గొర్ల కాపరుల సంఘం యూనియన్ ఎన్నికలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గొర్ల కాపరుల సహకార సంఘం యూనియన్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత రాష్ట్రంలోనే మొదటిసారి కరీంనగర్ జిల్లాలోనే ఎన్నికలు జరగడం గమనార్హం. అంతేగాకుండా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 ఏళ్ల తరువాత ఈ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి అక్బర్ జలాలోద్దిన్ తెలిపారు. అధ్యక్షుడిగా భాషవేని మల్లేశం యాదవ్ , ఉపాధ్యక్షులుగా చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్లుగా అగిత రవీందర్, కాల్వ సురేష్, చౌటపల్లి రంజిత్, జిల్లెల్ల పర్షరాములు, దాడి ఆంజనేయులు, దాడి సదయ్య, దానే ఒదేలు, బండి మల్లయ్య, ముక్కేర సదానందం, సందవేణి ప్రసాద్ ఎన్నికైనట్లు పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసినవారిలో 9 మంది విత్ డ్రా చేసుకోగా.. 12 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

30 ఏళ్ల తరువాత ఏకగ్రీవం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గొర్ల కాపరుల సహకార సంఘం జిల్లా యూనియన్ ఎన్నికలు 30 ఏళ్ల తర్వాత ఏకగ్రీవం కావడం విశేషం. గతంలో పోటీ నువ్వా నేనా అన్నట్లు రసవత్తరంగా ఉండేది. ఈసారి మాత్రం ఏకగ్రీవం చేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మల్లేశం యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఏకగ్రీవం చేయడంతో పాటు తన గెలుపునకు సహకరించిన జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం, యాదవ కురుమ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం నూతన కార్యవర్గం జిల్లా పశుసంవర్ధక అధికారి లింగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ యాదవ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య కురుమ, నాయకులు నాగారపు సత్యనారాయణ యాదవ్, కత్తుల రమేష్ యాదవ్, బబ్బురు కుమార్ యాదవ్, బీర్ల బీరయ్య కురుమ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>