హోమియోపతి వైద్యంలో భారత్‌‌కు మొదటి స్థానం : కరీంనగర్ మేయర్

కలం, కరీంనగర్ బ్యూరో : హోమియోపతి వైద్య విధానంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని కరీంనగర్ (Karimnagar) మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో హోమియోపతి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం, డాక్టర్ సామ్యూల్ హానిమాన్ 271 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర (Karimnagar) కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం హానిమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ను హోమియోపతి డాక్టర్లు శాలువాతో గౌవరంగా సత్కరించారు.

మేయర్ మాట్లాడుతూ… హోమియోపతి వైద్యం అన్ని రకాల వ్యాధులకు అందుబాటులో ఉందన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సురక్షితమైన వైద్య విధానంగా హోమియోపతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఈ వైద్యం దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో గొప్పగా పనిచేస్తుందన్నారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానిమాన్ ఎన్నో పరిశోధనల చేసి వైద్య రంగానికి అందించారని కొనియాడారు. హోమియోపతి వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న డాక్టర్లకు ప్రపంచ హోమియోపతి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎన్ ఎస్ రెడ్డి, ట్రెజర్ డాక్టర్ అఫ్సానా పలువురు హోమియోపతి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>