నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి.. కరీంనగర్‌లో సీపీఎం ఆందోళన!

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చిన ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) (CPI(M)) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ లక్షలాది మంది విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రతరం అవుతుందని, నోటిఫికేషన్లు రాక యువత తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పనను అమలు చేయాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షలకు పైగా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ​రాష్ట్ర ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలోని 20 వేల ఖాళీలతో పాటు DSC, JL, DL, Group-1, Group-2, Group-3, Group-4 పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని పేర్కొన్నారు.

ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 చొప్పున నిరుద్యోగ భృతి అందించాలి. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంతో పాటు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించి స్వయం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, ఐటీ సంస్థల్లో స్థానిక యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్త ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గీట్ల ముకుంద రెడ్డి గుడికందుల సత్యం, బీమా సాహెబ్, కె నాగరాణి, సీపీఐ(ఎం) ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>