కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సర్ అవగాహన (SIR Awareness) కార్యక్రమం శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SIR కమిటీ సభ్యుడు సతీష్ రెడ్డి సర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, దరఖాస్తుల సమర్పణ విధానం, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర సర్ కమిటీ ఇంచార్జ్ ఎల్. రమణ (Karimnagar BRS) అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం సర్ కోసం ప్రత్యేకంగా నియమింంచిన బీఎల్ఏలపైన ఇంచార్జ్ లను నియమించారు.
ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా బీఎల్ఏలు కృషి చేయాలని సూచించారు. బీఎల్ఏలకు సమస్యలు ఉత్పన్నమవుతే.. వారి ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతోపాటు బీఎల్ఏలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పదిమంది బూత్ లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించారు.
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండలం బూత్ ఇంచార్జిగా సుంకిశాల సంపత్ రావు, పెండ్యాల శ్యాం సుంధర్ రెడ్డి, తిప్పర్తి లక్ష్మయ్య, జువ్వాడి రాజేశ్వర్ రావు పబ్బతి రంగా రెడ్దిలను నియమించారు. వీరికి 2002 ఓటరు లిస్ట్ తో పాటు, పార్టీ గుర్తింపు కార్డు, ఇతర సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గం పార్టీ సభ్యత్వ ఇంచార్జి కొండూరు రవీందర్ రావు, పార్టీ ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ ముఖ్యులు, తదితరులు పాల్గొన్నారు.

