epaper
Wednesday, March 4, 2026
epaper

యుద్ధంలో ఎవ‌రు గెలిస్తే వాళ్ల మ‌తంలోకి మార‌తా: ఆర్జీవీ

క‌లం, వెబ్ డెస్క్‌: స్టార్‌ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ (RGV) మరోసారి సోషల్ మీడియాలో వివాదాస్ప‌ద పోస్టుల‌తో రెచ్చిపోయారు. అంతర్జాతీయ రాజకీయాలపై వ‌ర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా (America), ఇజ్రాయెల్‌ (Israel), ఇరాన్(Iran) మధ్య జ‌రుగుతున్న యుద్ధంపై ఆర్జీవీ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరాటం అనేది యేసు, అల్లాహ్ మధ్య పోరాటం లాంటిదేన‌ని, ఎవరు గెలుస్తారో, వారి మతంలోకి తాను మారిపోతానంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు దీనిని వ్యంగ్యంగా తీసుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు వ‌ర్మ అటెన్ష‌న్ కోస‌మే ఇలాంటి పోస్టులు పెడతాడంటూ లైట్ తీసుకుంటున్నారు.

ఈ యుద్ధంపై వ‌ర్మ మ‌రో పోస్ట్ కూడా చేశారు. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ బలం ఉన్నవాడు ఏది చేసినా స‌రైందేన‌ని వ‌ర్మ చెప్పాడు. దీనికి ఓ హిందీ సినిమా డైలాగ్‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు. “జిస్కే పాస్ పవర్ హై, ఉస్కా రాంగ్ భీ రైట్ హోజాతా హై” అని పేర్కొంటూ, ట్రంప్‌ సరైనవాడే, ఎందుకంటే ఆయన దగ్గర పవర్ ఉందని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!