కలం, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంలో వైసీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తన పేరును ప్రస్తావించడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫైర్ అయ్యారు. బొత్స ఒక నత్తోడని, ఆయనకు సరిగ్గా మాట్లాడటమే రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఎలా మంత్రి అయ్యారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు.
వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వైదొలిగిన అంశంపై స్పందిస్తూ.. తన గురించి అనుచితంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని మండిపడ్డారు. గతం మర్చిపోయి బొత్స పిచ్చికుక్క కరిచినట్లు ప్రవర్తిస్తున్నాడని నిప్పులు చెరిగారు. లక్షల మంది ఎదుట తన కాళ్లు పట్టుకుని గెలిపించమని బొత్స అడిగాడని, బొత్స తన గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. తాను యుద్ధాలు ఆపడానికి తిరుగుతుంటే , తన గురించి మాట్లాడటం అవసరమా? అని ప్రశ్నించారు. కాగా, విజయసాయిరెడ్డి మరో కేఏ పాల్ లాగా మారిపోయాడని, అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిన్న మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బొత్స సత్యనారాయణ జవాబిచ్చారు. దీంతో బొత్స వ్యాఖ్యలపై మండిపడిన కేఏ పాల్ తాజా వ్యాఖ్యలు చేశారు.

