మూడు ప్రత్యేక రెస్క్యూ బృందాలు సిద్ధం: ఎస్పీ అశోక్

కలం, జగిత్యాల: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జగిత్యాల జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (SP Ashok Kumar) తెలిపారు. వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ..

ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల (Jagtial Rains) కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు జిల్లా పోలీసు శాఖ (Jagtial Police) ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన 3 రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ బృందాలకు లైఫ్ జాకెట్లు, తాళ్లు, రెస్క్యూ కిట్లు, ఇతర ప్రత్యేక భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచామని అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెంటనే రక్షించడం వంటి చర్యలకు వీటిని వినియోగిస్తామని తెలిపారు.

ప్రత్యేక ఆదేశాలు జారీ..

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వర్షాల నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీతెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే పడవలు, ఇతర రక్షణ పరికరాలతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు.

ప్రజలు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని, అధికారుల సూచనలను పాటించాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వాగులు, వంకలు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే స్థానిక పోలీసులకు / డయల్-100కు సమాచారం అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>